NTV Telugu Site icon

CM Chandrababu: 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Cm Chandrababu

Cm Chandrababu

తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయ‌న పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా, మొత్తంగా 14 ఏళ్ళకు పైగా సీఎంగా ఉన్నా. పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పం నాది.” అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

READ MORE: Ranya Rao Case: నన్ను చెంపపై 15 సార్లు కొట్టారు.. ఆకలితో ఉంచి, ఖాళీ పేపర్‌పై సంతకం చేయించారు..

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర తన జీవిత లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. “ప్రజారోగ్యం కోసమే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర. ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. పరిసర ప్రాంతాలను ప్రతిఒక్కరూ శుభ్రంగా ఉండేలా చూడాలి. రోడ్లపై ప్రతి రోజు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోస్తున్నారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు.. అక్టోబర్ 2న నాటికి ఎక్కడా చెత్త కనిపించకుండా చేస్తాం. ఆ బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించాం. ఆత్మగౌరవం పేరుతో గతంలో మరుగుదొడ్లు నిర్మాణానికి పిలుపునిచ్చాం. 4 లక్షల 60 వేల మరుగుదొడ్లను మళ్లీ నిర్మించబోతున్నాం. ఇప్పటికే 72 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించాం.” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

READ MORE: Gutta Jwala : తెలుగు సినిమాలకి తెల్లగా ఉంటే చాలు : గుత్తాజ్వాల హాట్ కామెంట్స్