Site icon NTV Telugu

CM Chandrababu Naidu: ఢిల్లీకి పయనం కానున్న సీఎం.. పలు కేంద్రమంత్రులతో సమావేశాలు..!

Chandrababu Naidu Cm

Chandrababu Naidu Cm

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజులపాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కావనున్నట్టు సమాచారం. పెట్టుబడులు, అభివృద్ధి ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.

Read Also: Jagan Mohan Reddy: వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

అంతేగాక, ఎల్లుండి (మే 24) న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి తన నియోజకవర్గమైన కుప్పంకు వెళ్లనున్నారు. అక్కడ స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు.

Read Also: Cyber Crime: కామారెడ్డిలో సైబర్ మోసం.. 5.8 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..!

ఇదిలా ఉంటే.., ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు ఏపీ సచివాలయానికి చేరుకొని.. అక్కడ కొన్ని కీలక శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్టు సమాచారం.

Exit mobile version