Site icon NTV Telugu

CM Chandrababu: నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

Chandrababu Cm

Chandrababu Cm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.

Also Read:Weather Report : రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన..

కొత్త క్రిమినల్ చట్టాల అమలు, పాలనాపరమైన సంసిద్ధతపై చర్చ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన “రోడ్ మ్యాప్” ను సమర్పించడానికి “నీతి ఆయోగ్” పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్‌) సమావేశంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి తో భేటికానున్నారు. “గ్రీన్ ఎనర్జీ” ప్రాజెక్టులలో సహకారం గురించి చర్చించనున్నారు. తర్వాత, ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు.

“బెల్” డిఫెన్స్ కాంప్లెక్స్, “హెచ్.ఏ.ఎల్-ఏ.ఎమ్.సి.ఏ” (HAL-AMCA) కార్యక్రమంతో సహా, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదిత వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో జలశక్తి శాఖా మంత్రి సి.ఆర్. పాటిల్ తో సమావేశం కానున్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, పలు ఇతర ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఏపీ సీఎం అధికార నివాసం “జనపథ్‌-1” లో “శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) జితేంద్ర సింగ్ తో సమావేశం కానున్నారు.

Also Read:Rishabh Pant: నాపై ఫేక్‌ న్యూస్ రాసేకంటే.. మంచి సమాచారం ఇవ్వండి!

పారిశ్రామిక, విజ్ఞాన సహకారాలపై చర్చించనున్నారు. సాయంత్రం 3 గంటలకు “నార్త్ బ్లాక్‌”లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక కేటాయింపులు, తోడ్పాటును కోరనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సాయంత్రం 4 గంటలకు “నార్త్ బ్లాక్‌”లోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన రాష్ట్రాల్లో కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై కీలక సమీక్షా సమావేశం. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం కానున్నారు.

Also Read:Janhvi Kapoor : కత్తిలాంటి అందాలతో రెచ్చిపోయిన జాన్వీకపూర్..

డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు న్యూఢిల్లీలోని “భారత్ మండపం”లోని “కన్వెన్షన్ సెంటర్‌”లో జరగనున్న “నీతి ఆయోగ్” 10వ పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో సంస్కరణలతో కూడిన పాలన నమూనాతో పాటు, చేపట్టిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను, సమగ్ర, స్థిరమైన వృద్ధిని సాధించడానికి కేంద్రం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న వ్యూహాత్మక సహకారాన్ని చంద్రబాబు వివరించనున్నారు.

Exit mobile version