Site icon NTV Telugu

CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!

Cm Switzerland Visit

Cm Switzerland Visit

CM Switzerland visit: స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు భారత రాయబారి మృదుల్ కుమార్ తో జ్యూరిచ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని సీఎం భారత రాయబారిని కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, ఆర్ అండ్ డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కావాలని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న నిర్ణయాలను రాయబారి మృదుల్ కుమార్‌కు వివరించారు.

2025లో సీఎం చంద్రబాబు చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైందని, దాని ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని భారత రాయబారి మృదుల్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఇంకా మధ్య యూరప్‌లోని లిచ్టెన్‌స్టైన్ దేశంలో జరుగుతున్న ఏఐ పురోగతిపై మృదుల్ కుమార్ సీఎంకు వివరించారు.

యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?

ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేయడంలో రాయబారి కీలక పాత్ర పోషించాలని సూచించారు. వివిధ రంగాలకు అవసరమైన మ్యాన్‌ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఏపీలో ఉన్నాయని, వాటిని స్విట్జర్లాండ్ కంపెనీలతో కనెక్ట్ చేస్తామని చెప్పారు. బీ టు బీ (B to B) భాగస్వామ్యంతో పెట్టుబడులను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు.

Exit mobile version