Site icon NTV Telugu

NTR Death Anniversary: కారణజన్ముడు, యుగ పురుషుడు.. ఎన్టీఆర్ కు ఘన నివాళి తెలిపిన సీఎం చంద్రబాబు..!

Ntr

Ntr

NTR Death Anniversary: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, యుగపురుషుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు, తెలుగు తమ్ముళ్లు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు X వేదికగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ సందేశాలు పోస్ట్ చేశారు.

NTRVardhanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా, నందమూరి కుటుంబ సభ్యుల నివాళులు

సీఎం చంద్రబాబు తన పోస్టులో ఎన్టీఆర్‌ను “కారణజన్ముడు, పేదల పెన్నిధి, యుగపురుషుడు”గా కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్ సరఫరా, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలతో చరిత్ర గమనాన్ని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన వేసిన బాట నేటికీ అనుసరణీయమని పేర్కొంటూ మరోసారి స్మృత్యంజలి ఘటించారు.

DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!

మంత్రి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను “తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు”గా అభివర్ణించారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల చిత్రాలను ఇళ్లలో దేవుడిలా పూజించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. భౌతికంగా దూరమైనా, తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ సజీవంగా ఉన్నారని రాసుకొచ్చారు.

Exit mobile version