Site icon NTV Telugu

CM Chandrababu: మంత్రులతో తొలి భేటీ.. కీలకాంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..

Cabinet

Cabinet

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక, ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఆ తర్వాత తొలిసారి మంత్రులతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. మంత్రులతో సుమారు 20 నిమిషాల సేపు సమావేశం నిర్వహించారు.. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు.

Read Also: Deputy C M: రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా? గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని సూచించారు.. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదాం అన్నారు. మరోవైపు.. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొనగా.. రేపటిలోగా శాఖలను కేటాయిస్తాను అని స్పష్టం చేశారు చంద్రబాబు.. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కొత్త మంత్రులకు కీలక సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, మంత్రుల సమావేశం తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం.. రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం ఫ్యామిలీ.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సచివాలయంలో ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు చంద్రబాబు..

 

 

 

 

 

 

 

 

Exit mobile version