Site icon NTV Telugu

CM Chandrababu: దుబాయ్ లో బిజీబిజీగా సీఎం.. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జిల్ హెల్త్ కేర్‌తో కీలక భేటీలు!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో మొదటి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్. రామకృష్ణన్, అలాగే బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో కీలక చర్చలు జరిపారు.

World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్‌తోనే భారత్‌కు ముప్పు! శ్రీలంక ఉన్నా

ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్‌తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. దీనిపై ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సానుకూలంగా స్పందించి ఆసక్తి కనబరిచింది. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనలతో ఉన్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని, రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు తెలిపారు.

kantara Chapter-1: కాంతార ఛాప్టర్-1 లో రిషబ్ శెట్టి డ్యూయెల్ రోల్ చేశాడని తెలుసా?

అలాగే, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ సంస్థ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ముఖ్యంగా, తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. వైద్యారోగ్య రంగంలో తమ ప్రభుత్వం ‘ప్రివెంటివ్-క్యూరేటివ్’ అనే విధానాన్ని అవలంబిస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టినట్టు ఆయన తెలిపారు. బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్‌కు వైద్యారోగ్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌పై మంచి అనుభవం ఉంది. ఈ సంస్థ అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తోంది. మొత్తంగా దుబాయ్ పర్యటనలో సీఎం చంద్రబాబు మరిన్ని కీలక సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version