Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Naidu Anantapur Visit Today Full Schedule Details

CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Published Date :April 6, 2026 , 8:30 am
By Sudhakar Ravula
CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

* ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.

* ఉదయం 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి యాడికి గ్రామ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించే “ప్రజా వేదిక” సమావేశానికి చేరుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.

* మధ్యాహ్నం 01:00 నుంచి 01:30 వరకు సమయం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత 01:30 గంటలకు ప్రజా వేదిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం అక్కడి నుంచి బయలుదేరి 01:40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుంటారు.

* వేములపాడు వద్ద ఉన్న పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని మధ్యాహ్నం 01:40 నుంచి 02:30 వరకు సందర్శిస్తారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు, ముఖ్యంగా PMDS మరియు హాఫ్ మూన్ మోడల్ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం 02:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 02:40 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

* మధ్యాహ్నం 02:40 నుంచి సాయంత్రం 04:10 వరకు వేములపాడులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో (Cadre Meeting) సీఎం పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.

* చివరగా సాయంత్రం 04:20 గంటలకు వేములపాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 06:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను సమీక్షించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur News
  • AP CM schedule today
  • AP politics news
  • Chandrababu Naidu Anantapur tour
  • Chandrababu visit schedule

తాజావార్తలు

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions