Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!
- ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని
- రహస్యంగా సినిమా వీక్షించి పాత్రపై ప్రశంస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్-2’ సినిమా భారీ విజయంతో దూసుకెళ్తోంది. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శనను పాకిస్థాన్‌లో అధికారికంగా నిషేధం విధించారు. కానీ పైరసీ రూపంలో అనధికారికంగా దాయాది దేశంలో చలామణి అవుతోంది.
అయితే ధురందర్-2 సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను రహస్యంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వీక్షించినట్లుగా పాకిస్థాన్ జర్నలిస్ట్ ఖలీద్ మెహమూద్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నవాజ్ కుమార్తె మరియం నవాజ్‌ను కూడా జర్నలిస్ట్ ట్యాగ్ చేశాడు. ఇక ఈ సినిమాను విడుదలైన రోజునే మార్చి 19న తాను లాహోర్‌లో వీక్షించినట్లుగా జర్నలిస్ట్ తెలిపాడు.
Also Read
అయితే ధురందర్-2 సినిమాను నవాజ్ షరీఫ్ రహస్యంగా చూశారని.. తనను పోలి ఉన్న పాత్రను చూసి ఎంతగానో మురిసిపోయారని.. తన పాత్రను ప్రశంసించారని జర్నలిస్ట్ తెలిపాడు. సినిమా కాపీని ఏర్పాటు చేయాలని తన స్నేహితుడిని షరీఫ్ కోరారని.. సినిమా కాపీని తెప్పించుకుని పూర్తిగా సినిమా వీక్షించారని పేర్కొన్నాడు.

ధురంధర్-2లో సినిమాలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక నవాజ్ షరీఫ్ పాత్రలో ప్రముఖ చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి మనవడు మషూర్ అమ్రోహి నటించారు. నవాజ్ షరీఫ్‌కు తగ్గట్టుగానే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రను సహజంగా చూపించేందుకు అమ్రోహీ ప్రత్యేకమైన ప్రోస్తెటిక్ మేకప్‌తో పాటు ప్రత్యేక బాడీ సూట్ ఉపయోగించినట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే మొదట మషూర్ అమ్రోహి… మెజర్ ఇక్బాల్ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వగా.. ఆ పాత్ర చివరికి నటుడు అర్జున్ రాంపాల్‌కు దక్కింది.

ధురంధర్ -2 పాకిస్థాన్ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా పైరసీ ద్వారా ప్రదర్శింపబడుతోంది. స్థానిక మార్కెట్లలో సినిమా కాపీలు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇక నవాజ్ షరీఫ్.. ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నయ్య.
Nawaz Sharif greatly appreciated his role in Dhurandhar 2. He asked a friend to arrange a copy of the film and watched it in full.#Dhurandhar2TheRevenge@MaryamNSharif@AdityaRajKaul pic.twitter.com/9CROAMF6Lx
— Khalid Mehmood Khalid (@kmkhalid62) April 5, 2026
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!