ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు గవర్నర్‌తో సీఎం సమావేశం అయ్యారు. కూటమి ఏడాది పాలనపై చర్చ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై వివరాలను గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. బనకచర్ల ప్రాజెక్ట్, సీఎం ఢిల్లీ టూర్‌పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీ నేతల వ్యవహార శైలి, తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి సీఎం తీసుకు వెళ్లారు. త్వరలో సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్‌ను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
CM Chandrababu: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ!
- గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- కూటమి ఏడాది పాలనపై చర్చ
- సీఎం ఢిల్లీ టూర్‌పై కూడా చర్చ

Chandrababu Governor Abdul Nazeer