Site icon NTV Telugu

CM Chandrababu: ఎంపీలతో సీఎం సమావేశం.. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలు!

Untitled Design

Untitled Design

నేడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎంపీలు పార్లమెంట్‌లో తమ స్వరం వినిపించాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు రావాలన్నారు సీఎం.

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిపై అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులతో రాష్ట్ర సమస్యలను, ఇతర అంశాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు ఢిల్లీ వెళ్లినట్టు ఎంపీలతో సీఎం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించానని, ఇదే వైఖరి ఎంపీలు కూడా కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు.

‘రెండు గంటల పాటు ఎంపీలతో సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ జరిగింది. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో ఇప్పటికే సీఎం చంద్రబాబు సమావేశాలు జరిగాయి. ఈ కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు కావాలని కోరుతున్నాం’ అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Exit mobile version