CM Chandrababu: సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
- 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ
- గతంలో విడుదలైన ‘చంద్రబాబు X.0’ పుస్తకం
- పుస్తకాన్ని రచించిన శాఖమూరు శ్రీనివాస ప్రసాద్
- ఆంగ్లంలో అనువదించిన కేవీ సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBN@361 Degrees-Polymath: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘సీబీఎన్@361 డిగ్రీస్-పాలీమ్యాథ్’ పేరుతో రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఈ పుస్తకాన్ని విడుదల చేసి తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి. నారాయణతో పాటు అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ పుస్తకాన్ని ‘రేపటి కోసం’ దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. సీఎం చంద్రబాబు దార్శనిక నాయకుడిగా వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు, పాలనా విధానం, అభివృద్ధి దృష్టికోణాన్ని విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా రచయిత శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ, న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ వంటి అంతర్జాతీయ నాయకుల తరహాలోనే చంద్రబాబు నాయుడు కూడా విజన్‌తో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రూపొందిస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికలు, అమరావతి రాజధాని నిర్మాణంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఏపీ రెరా మాజీ చైర్మన్ రామనాథ్ వివిధ సందర్భాల్లో వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రజలకు తెలియని అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. రాజకీయ నాయకత్వం, పరిపాలన, విజన్ ఆధారిత అభివృద్ధి వంటి అంశాలపై ఈ పుస్తకం లోతైన విశ్లేషణ అందిస్తుందని పేర్కొన్నారు.
Also Read
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
కార్యక్రమంలో భాగంగా సింగపూర్ వ్యవస్థాపక నేత లీ క్వాన్ యూ శతజయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వెండి నాణేన్ని కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు బహూకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలోనే ఈ పుస్తకాన్ని తెలుగు, హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో విడుదలైన ‘చంద్రబాబు X.0’ పుస్తకానికి విశేష ఆదరణ లభించిందని, దాని సాఫ్ట్ కాపీని ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘CBN@361 Degrees’ పుస్తకం రాజకీయ పరిశోధకులు, నాయకత్వ లక్షణాలపై అధ్యయనం చేసే విద్యార్థులు, మేనేజ్మెంట్ విద్యార్థులు సహా పాలనా వ్యవస్థపై ఆసక్తి ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?