CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీట మునగడం, నదుల్లో వరద ప్రవాహాలపై సీఎస్ సాయిప్రసాద్ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.
గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించారు.
Also Read
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులను పూర్తిచేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా సీఎం సమీక్షించారు.
కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద కారణంగానే ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. స్థానికంగా వస్తున్న వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్ ఎగువన బ్యారేజ్ నిర్మాణం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సీఎం ఆదేశించారు.
తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50% నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.8% వర్షపాతం లోటు ఉండగా.. రాయలసీమలో 42% లోటు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!