NTV Telugu Site icon

CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్‌ వార్నింగ్..! అలా అయితే కష్టం..

Workshop

Workshop

CM Chandrababu: మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు… అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు… బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. మీకు వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోండి అంటూ సూచించారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలి.. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకున్నారన్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలి అంటూ సూచించారు సీఎం…

Read Also: Ponnam Prabhakar : నేతన్నలు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుంది

నేను 1978లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచాను 1980లో మంత్రి అయ్యాను.. ఇప్పటికి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను…4 సార్లు సీఎం అయ్యాను అన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది అన్నారు.. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. టీడీపీ నుండి 61 మంది, జనసేన నుండి 15 మంది, బీజేపీ నుండి నలుగురు, వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు 30 మంది టీడీపీ నుంచి ఉన్నారని వివరించారు..

Read Also: Winter: శీతాకాలంలో ఇంటి నిర్మాణం గురించి జాగ్రత్తలు..!

ఇక, ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యే దాకా టెక్నాలజీ వచ్చింది.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళం సభలో పబ్లిక్ పాలసీలు రూపొందిస్తాం. ఈ పాలసీలు ప్రజా జీవితంలో మార్పులు తెస్తాయి అన్నారు సీఎం చంద్రబాబు.. మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయన్నారు.. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లం. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోంది. ఇది మంచిది కాదు అని హెచ్చరించారు.. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకోవాలి.. తెలుసుకోవాలి.. శాఖల్లో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో మీకు తెలియదు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అన్నారు ముఖ్యమంత్రి.

Read Also: Naveen Ramgoolam: మారిషన్ ప్రధానిగా నవీన్ రామ్‌గూలం విజయం.. మోడీ అభినందన..

అసెంబ్లీలో నాడు ఎన్టీఆర్, సుందరయ్య ఏం మాట్లాడారో ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి.. కేంద్రం కూడా ఎంపీలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లు పెడుతోందన్న సీఎం చంద్రబాబు.. మీ నాలెడ్జ్, వినూత్న ఆలోచనలను సభలో పంచుకుంటే తప్పకుండా వినియోగించుకుంటాం. కేంద్ర బడ్జెట్ లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలుగా ఉండాలి. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం.. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేం పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు.. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరు. గతంలో అదే జరిగింది.. విజన్-2047పై మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసన సభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలి అన్నారు సీఎం.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా, కొంత హెచ్చరికలతో, కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వారికి సూచనలు సలహాలతో వర్క్ షాప్ కొనసాగింది.