Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం ఓపెనింగ్..!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu: గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని, అందులోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల గురించి, నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం యొక్క ప్రత్యేకతల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, అత్యాధునిక పరికరాల గురించి నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు.

Helicopter Crash: రష్యాలోని రాతి బీచ్‌లో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి (వీడియో)

అనంతరం, శంకర ఐ ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అందిస్తున్న సేవలను గురించి కూడా నిర్వాహకులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ముఖ్యంగా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా జరుగుతున్న సేవలు, ప్రజలకు ఉచితంగా అందుతున్న వైద్య సహాయం వంటి వివరాలను సీఎంకు వివరించారు. ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించడంలో ఈ నూతన కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.

Japan Earthquake: జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Exit mobile version