Site icon NTV Telugu

CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం

Chandrababu

Chandrababu

CM Chandrababu : ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలు పాల్గొంటారు. ఆన్లైన్ విధానంలో జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. అయితే.. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు.

US Election Results: అమెరికా మినీ ఇండియాలో భారతీయులు ఎవరికి పట్టం కట్టనున్నారంటే?

ప్రజల అర్జీల సత్వర పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టడం, ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం తీసుకురావడంపై ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేయనున్నారు. ఇదేకాకుండా.. రాష్ట్ర అభివృద్దికి 10 సూత్రాలతో ప్రణాళికి సిద్దం చేసిన ముఖ్యమంత్రి.. ఈ లక్ష్యాల సాధనకు ఆయా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే.. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.

Metro Google Wallet: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్..

Exit mobile version