Site icon NTV Telugu

AP Pensions: ఏపీలో పెన్షన్దారులకు సర్కార్ గుడ్ న్యూస్..

Pensions Distribution, Andh

Pensions Distribution, Andh

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలలా కాకుండా.. సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో లేకపోవడం, ఏదైనా కారణం వల్లనైనా 31వ తేదీన పెన్షన్లు అందకపోతే.. సెప్టెంబర్ 2వ తేదీన (సోమవారం) అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Exit mobile version