Site icon NTV Telugu

CM Chandrababu : నేడు సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతారు. . సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈనెల 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.

US vs India: భారత్‌కు అండగా ఉండాలంటే.. పాక్‌కు సహాయాన్ని నిషేధించాలి: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

ఏపీకి సంబంధించిన అంశాలపై సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడనున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ సహా, పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటీ అవుతారనే విషయంపై అధికారిక సమాచారం లేదు. శనివారం సాయంత్రం చంద్రబాబు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.

Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..

Exit mobile version