Site icon NTV Telugu

CM Chandrababu: లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.. వ్యయం తగ్గించడమే లక్ష్యం!

Cm Chandrababu Assembly

Cm Chandrababu Assembly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉందన్నారు. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే.. ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై సీఎం అసెంబ్లీలో మాట్లాడారు.

‘వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలి. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లుగా ఉంది. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉంది. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉంది. లాజిస్టిక్స్‌కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. ఇది ఉత్పత్తి దారులకు, వినియోగదారులకూ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. వస్తు రవాణా తూర్పు కోస్తా తీరంలో ఉన్న ఏపీ ఓ కీలకమైన ప్రాంతం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎకో సిస్టంలో రైలు, రోడ్డు, జల రవాణాతో పాటు పైప్ లైన్ మార్గం కూడా కీలకంగా మారింది. పైప్ లైన్ ద్వారా గ్యాస్, నీరు, స్లర్రీ లాంటివి రవాణా చేసేందుక ఆస్కారం ఉంది. మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టం ద్వారా హైయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువ అవుతుంది. ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. లాజిస్టిక్స్ ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని కోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించటమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read: Jogi Ramesh: చిరంజీవిని తిడితే.. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు!

‘మలేషియాలో ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌లో 8 వరుసల రోడ్లు వేశారు. అప్పట్లో వాజ్‌పేయీతో మాట్లాడి నెల్లూరు-చెన్నై హైవేను తెచ్చాం. దేశానికి మణిహారంగా గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌ ప్రాజెక్టు మారింది. స్థానిక భూములు, ట్రాఫిక్‌ పరిస్థితులు చూసి రోడ్లు వేస్తాం. హైవేల విషయంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. హైవేల్లో రూ.లక్షన్నర కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రైల్వే డబుల్‌ లైన్లను నాలుగు వరుసలుగా మార్చే అవకాశం ఉంది. రైల్వేలో హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లపై చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లు కాబోతున్నాయి. మన రాష్ట్రంలో రైల్వేలో 145 రకాల పనులు జరుగుతున్నాయి. మేం వచ్చిన వెంటనే విశాఖ రైల్వే జోన్‌ ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Exit mobile version