Site icon NTV Telugu

Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్‌కి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సీఎం!

Chandrababu Cm

Chandrababu Cm

నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్‌ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్‌) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు.

Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!

తారక రామారావు కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. యువ హీరోకి ఆల్‌ ది బెస్ట్ చెబుతూ.. గొప్ప విజయాలు అందుకోవాలంటూ ఆకాక్షించారు. ‘స్వర్గీయ శ్రీ జానకిరామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తొలి చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలవుతున్నందున ఆయన గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు.

Exit mobile version