Site icon NTV Telugu

CM Chandrababu: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఎత్తిన సీఎం చంద్రబాబు..

Cm Chandrababu1

Cm Chandrababu1

Cm Chandrababu2

నేడు సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా కపిలేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్‌ని ధరించారు.

తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.

ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని, అంచెలంచెలుగా ఎదిగి నాలుగోసారి సీఎం అయ్యానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

Exit mobile version