Site icon NTV Telugu

AP Cabinet: మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు.

Babu

Babu

AP Cabinet: జనసేన-బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వారికి మంత్రి పదవులు కేటాయించడంతో పాటు.. కీలక మంత్రిత్వశాఖలు కేటాయించారు.. మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించారు సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం హెూదాను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఒక్కరికే పరిమితం చేశారు.. 2014-19 మధ్య కాలంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చిన చంద్రబాబు.. ఇక, 2019–24 మధ్య కాలంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఇప్పుడు కేబినెట్‌లోకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు చంద్రబబు.. పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.. చంద్రబాబు పెట్ సబ్జెక్ట్ టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు ఏపీ సీఎం.. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Exit mobile version