Nara Rammurthy naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12:45కు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 14న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రేపు (ఆదివారం) చంద్రబాబు నాయుడి సొంతూరు నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also: Director Death: సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మృతి!
అయితే, వ్యవసాయ కుటుంబానికి చెందిన నారా రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేసేవారు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలపై ఆసక్తితో స్నేహితులతో కలిసి తిరుపతిలో కళా పరిషత్ ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత కాంట్రాక్టు పనులు ప్రారంభించారు. అలాగే, అన్న నారా చంద్రబాబుకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు రామ్మూర్తి నాయుడు. ఇక, 1977లో చంద్రగిరి, పులిచర్ల మండలాల్లో పార్టీ కోసం పని చేశారు. అన్న కోసం డోర్ టూ డోర్ ప్రచారం కూడా చేశారు. అప్పటి వరకు చంద్రబాబుకు తోడుగా ఉంటూ వచ్చిన రామ్మూర్తి నాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు.
Read Also: Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..
ఇక, 1994లో తెలుగుదేశం పార్టీ తరపున అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1996, 97, 98లలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఛైర్మన్ గా కూడా విధులు నిర్వహించారు. 1996లో చంద్రగిరిలో రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. 1998లో తిరుపతి తారకరామారావు స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ ను ముఖ్య అతిథిగా నారా రామ్మూర్తి నాయుడు ఆహ్వానించారు. ఇక, 1999 ఓటమి తర్వాత మానసిక క్షోభకు గురయ్యారు. ఆ తర్వాత 2002 నుంచి ఆయన ఆరోగ్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. 2003లో ఢీల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడంతో.. విభేదించిన ఆయన 2004లో చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గల్లా అరుణకుమారి, రామనాథంలపై పోటీ చేసి 36 వేలు పైచిలుకు ఓట్లు సాధించారు.