Site icon NTV Telugu

Viral Video: హరిద్వార్‍ను కమ్మేసిన కారు మేఘాలు..

Haridwar

Haridwar

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read Also: PUBG love story: చికెన్ బిర్యానీ వదిలేసింది.. తులసి పూజ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ మహిళ

షెల్ఫ్ మేఘాలు ఒక రకమైన ఆర్కస్ క్లౌడ్ అని వాటికి ఆకట్టుకునే రూపంతో కనిపిస్తూ.. భయపెడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన క్లౌడ్ ఫార్మేషన్‌లు తరచుగా ఉరుము లేదా క్యుములోనింబస్ క్లౌడ్ బేస్ నుంచి విస్తరిస్తాయని వారు పేర్కొన్నారు. షెల్ఫ్ మేఘాలు విధ్వంసక సుడిగాలులతో పాటు తీవ్రమైన తుఫానులతో సంబంధం కలిగి ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇవి ఉరుములతో కూడిన తుఫానులను సృష్టించే అవకాశం ఉందని.. దీంతో పాటే వాతావరణంలో మార్పులకు సూచనగా చెప్పొచ్చని వారు చెప్పారు.

Read Also: Rocking Rakesh: లండన్ లో రాకేష్-సుజాత.. సడెన్ ట్రిప్ అందుకేనా?

షెల్ఫ్ క్లౌడ్స్ సాధారణంగా ఉరుములతో ఏర్పడతాయి. ఇక్కడ చల్లటి ముందరి వల్ల తేమతో కూడిన వెచ్చని గాలి వేగంగా పైకి లేస్తుంది.. దీంతో వెచ్చని గాలి పైకొచ్చినప్పుడు అది చల్లబడి ఘనీభవించి.. మేఘాన్ని ఏర్పరుస్తుంది. ముందుకు సాగుతున్న చల్లని గాలి ఒక ప్రత్యేకమైన సరిహద్దును సృష్టిస్తుంది. ఇది షెల్ఫ్ క్లౌడ్ ఏర్పడటానికి ప్రేరేపిస్తుంది. ఉరుములతో కూడిన బలమైన గాలులను సూచిస్తూ. భారీ తుఫాన్ కు కారణమవుతుంది. వాటి ఉనికి రాబోయే తీవ్రమైన వాతావరణానికి సంబంధించిన దృశ్య హెచ్చరికకు చిహ్నంగా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version