తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ( ఆదివారం ) మధ్యాహ్నం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు.
Also Read : Amala Akkineni: ఏజెంట్ లో కొన్ని లోపాలున్నాయి.. కొడుకు సినిమాపై అమల షాకింగ్ కామెంట్స్
ఈ సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది.
Also Read : Rekha Singh: భర్త పేరు నిలబెట్టింది.. ఆర్మీ ఆఫీసర్‌గా “గాల్వాన్ హీరో” భార్య..
అలాగే నగరంలో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పలు మార్గాల ద్వారా వెళ్లేలా రూట్ మ్యాప్ లను హైదరాదాద్ పోలీసులు విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Also Read : Margani Bharatram: ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తోంది కపట ప్రేమ
వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరస్థితులను బట్టి ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెన్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసివేయనున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్ లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.