Site icon NTV Telugu

Minister Harish Rao: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్

Harish Rao

Harish Rao

ఈనెల 15న సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆయన అన్నారు.

Read Also: Madhya Pradesh: తప్పు చేసిన తల్లిని పీడకలల్లో వేధించిన కొడుకు.. చివరకు అసలు నిజం బయటపడింది..

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో నేడు (గురువారం) వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15 న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

Read Also: Minister RK Roja: చంద్రబాబుది మాటల ప్రభుత్వం.. జగన్ మోహన్ రెడ్డిది చేతల ప్రభుత్వం

ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మంత్రి ఆదేశించారు. అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్ లు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Read Also: Miss Shetty Mr Polishetty Review: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి రివ్యూ

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. 2014 లో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.

Exit mobile version