NTV Telugu Site icon

Delhi Shocker: తోటి విద్యార్థిని హత్య చేసిన క్లాస్ మెట్స్

Knife

Knife

Delhi Shocker: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. తోటి విద్యార్థుల దాడిలో 17ఏళ్ల యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం సెప్టెంబర్ 29న విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లు ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ వచ్చింది. వెంటనే దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు.

Read Also: lion hiding: దారి తప్పి జనాల్లోకి వచ్చిన మృగరాజు

క్లాస్ మేట్స్ దాడిలో హతమైన విద్యార్థిని దీపాన్షుగా పోలీసులు గుర్తించారు. తరగతి గదిలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ఎలాగైనా తనపై దాడి చేయాలని తోటి విద్యార్థులు పథకం పన్నారు. అందుకు కావాల్సిన ఆయుధాన్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. దాడిలో మొత్తం ఐదుగురు విద్యార్థులు పాల్గొన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఉషా రంగ్నావి తెలిపారు.

దాడిలో గాయపడిన దీపాన్షును ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనలో పోలీసులు ఐపీసీ సెక్షన్ 302, 307, 34కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించినట్లు పోలీసులు చెప్పారు. లాల్ బాఘ్, ఆజాద్ పుర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్ లను దాడి జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.

Read Also: Pakistan: విమాన సిబ్బంది సరైన “లోదుస్తులు” ధరించాలి.. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ వింత ఆదేశాలు