వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అసమ్మతి పాకింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రకు టికెట్ ఇస్తే నామినేషన్ వేసేందుకు 150మంది ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి వర్గీయుల తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో మధుసూదనాచారి ఫాలోవర్స్ సమావేశమయ్యారు. చారి సాబ్ కే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానానికి అల్టిమేటం.. బీఆర్ఎస్ పార్టీ హై కమాండక్ కు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
Also Read : Madhyapradesh: పెంపుడు కుక్క కోసం గొడవ.. భార్యాపిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ గొడవ జరుగుతుంటే మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గండ్రకు టికెట్ ఇస్తే 150మంది తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. నియోజ కవర్గానికి చెందిన మధుసూదనా చారి అనుచరులు హైదరాబాద్ లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Smart Phones : మొబైల్ పౌచ్ లో ఇలాంటి పెడితే ఇక అంతే.. ఫోన్ పేలిపోవడం ఖాయం..