NTV Telugu Site icon

Palasa Ysrcp Vs Tdp: పలాసలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. భగ్గుమన్న పాతకక్షలు

Tdp Vs Ycp

Tdp Vs Ycp

వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రికత్తకు దారితీస్తోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చిన్న మురహరిపురంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించేందుకు మాజీ ఎంపీపీ గొరకల వసంతరావు ఆధ్వర్యంలో తల పెట్టిన గ్రామ సభ రసాభాసగా మారింది. దీంతో అధికార వైసిపి , టిడిపి వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. వైసిపి వర్గీయులు కర్ని కూర్మారావు, కర్ని.వెంకటరావు, ఇల్లుమళ్ల రాజారావు. అద్ది అప్పలస్వామి, కరిమి తారకేశ్వరరావులు టిడిపికి చెందిన తామాడ భారతమ్మ,తామాడ మోహనరావు, తామాడ శంకరరావు బత్తిన కూర్మారావులు కర్రలు , కత్తులతో కొట్టుకున్నట్టు గ్రామస్తులు, పోలీసుల ద్వారా తెలుస్తోంది.

Read Also: Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం

వైసీపీకి చెందిన ఒక వ్యక్తికి పళ్లు విరిగి పోగా, టీడీపీకి చెందిన తామాడ భారతమ్మ కు చేయి విరిగి పోవడంతో పాటు శరీరంపై బలమైన గాయాలు అయ్యాయి. తామాడ మోహనరావు చేతివేళ్లకు గాయాలయ్యాయి., తామాడ శంకరరావు బత్తిన కూర్మారావులకు కూడా గాయాలయ్యాయి. బంధువులు బాధితులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్సై మధుసూదనరావు వెల్లడించారు.

Read Also: YSRCP MLC Candidates: నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన