NTV Telugu Site icon

Andhra Pradesh Crime: వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

Vinayaka Statue

Vinayaka Statue

Andhra Pradesh Crime: దేశవ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రజలు.. కుల, మతాలకు అతీతంగా గణేష్‌ ఉత్సవాలు జరుగుతున్నాయి.. అయితే, కొన్ని ప్రాంతాల్లో అపశృతిలు చోటు చేసుకున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వినాయక విగ్రహం విషయంలో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం ఒకరి మృతికి కారణమ్తెయింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరగిల్లులో చోటు చేసుకుంది. గ్రామంలోని బీసీ క్వాటర్స్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం విషయంలో యువకులు గొడవపడ్డారు. ఈ గొడవ కాస్తా గ్రామంలోని వారు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.. ఈ దాడిలో అనంతయ్య అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కావడంతో.. అక్కడికక్కడే మృతిచెందినట్టుగా స్థానికులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మరో 10 మంది గ్రామస్థులు తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేసుకున్న పోలీసులు.. అనంతయ్య మృతదేహన్ని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఘర్షణ, హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Read Also: Viral News : పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.. ఇడ్లీలు అమ్ముకుంటున్న చంద్రయాన్ -3 టెక్నీషియన్

Show comments