NTV Telugu Site icon

Hyderabad: టోలిచౌకిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. కాల్పుల కలకలం?

Gun Fire

Gun Fire

Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్ ఫైర్ జరిగినట్లుగా ఎలాంటి ఆనవాలు లేవని డీఐ బాలకృష్ణ స్పష్టం చేశారు.

Also Read: India vs England: కటక్ వేదికగా దుల్ల కొట్టేయడానికి సిద్దమైన టీమిండియా.. కోహ్లీ తిరిగి రానున్నాడా?

అక్తర్ వద్ద ఉన్న లైసెన్సు తుపాకీని పరిశీలించామని, ఫైర్ ఓపెన్ చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ఇరువర్గాలు ఎవరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని డీఐ తెలిపారు. అయితే, జరిగిన ఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపడతారని ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐ బాలకృష్ణ తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనపై పోలీసులు నిశితంగా విచారణ కొనసాగిస్తున్నారు.