కేసులు బుక్ అవగానే గప్‌చుప్‌మని దేశం దాటేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చి నియోజకవర్గంలో వాలిపోయారు? పైగా వేధింపులు, సాధింపులు అంటూ సెంటిమెంట్ పండించి పొలిటికల్ ఆయింట్‌మెంట్ రాయడం వెనకున్న వ్యూహం ఏంటి? నాడు వణికించిన కేసుల భయం ఇప్పుడెందుకు పోయింది? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన ఔట్ గోయింగ్ అండ్ ఇన్ కమింగ్ స్టోరీ? నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు.. నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా…
ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ.. గులాబీ పార్టీకి తలనొప్పిగా మారారా..? కేసుల్లో పీకల్లోతున ఇరుక్కుపోయి నియోజకవర్గాలను గాలికి వదిలేశారా? మాకు దిక్కెవరు మహాప్రభో… అంటూ కేడర్ మొత్తుకుంటోందా? ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం నిజమేనా? ఎవరా ఇద్దరు మాజీలు? ఏంటా కేసుల కహానీ? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. పదేళ్లు ఎమ్మెల్యేలుగా హవా నడిపిన నేతలిద్దరూ ప్రస్తుతం కేసులతో ఉక్కిరి…
Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్…
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యయత్నం కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు అల్తాప్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ తలపై పెట్టుకుని చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియోను విడుదల చేశాడు. నా హత్యకు కుట్ర చేశారు.. సొంత పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడారు అని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలో మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయిందంటున్నారు ఎమ్మెల్యే షకీల్. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఈ విధంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని షకీల్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్…