Gangireddu Melam: భిక్షాటన వివాదం.. రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపై కొట్టుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangireddu Melam: భిక్షాటన విషయంలోనూ కొన్ని ఒప్పందాలు ఉంటాయి.. మా ఏరియాలోకి మీరు రావొద్దు.. మీ ప్రాంతంలోకి మేం రాము.. అంతే కాదు.. సామాజిక వర్గాన్ని బట్టి వారు వివిధ రూపాల్లో భిక్షాటన చేస్తుంటారు.. అయితే, భిక్షాటన విషయంలో కుల కట్టుబాట్లను ధిక్కరించారని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.. ఇది కాస్తా చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.
Read Also: Astrology :మే 17, బుధవారం దినఫలాలు
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ఇంతకీ గొడవ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే.. గంగిరెద్దుల వారు వివాదం మొదలైంది.. సాధారణంగా గంగిరెద్దుల ఒక వెనుకబడిన కులం – ఏ గ్రూపు. సంక్రాంతి పండుగ నెలపెట్టిందంటే ఊరూర డూడూ బసవన్నల నృత్యాలతో ఇంటి ముంగిట కనువిందు చేస్తాయి. ఈ ఆనందాన్ని తిలకించి వారు పెట్టే పిడికెడు గింజలతో పొట్టనింపుకొని దేశసంచారం చేస్తారు గంగిరెద్దులవారు. సంవత్సరంలో ఆరునెలల కాలం పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు గంగిరెద్దులతో కుటుంబ సమేతంగా వలసలు వెళతారు. వీరిలోనూ రెండు తెగలు. ఒకరు పూర్తిగా గంగిరెద్దుల మీద జీవనం సాగిస్తుండగా, మరొక తెగ యక్షగాన కళాకారులు. వీరు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి వీధి నాటకాలు ప్రదర్శించి వారిచ్చే సంభావనతో కుటుంబాలు పోషించుకుంటారు. ఇక, చావు, బతుకుల దగ్గర కూడా గంగిరెద్దుల వారు భిక్షాటన చేస్తారు.. మొండిపట్టు పట్టి మరీ డబ్బులు వసూలు చేస్తుంటారు..
Read Also: Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
అయితే, తమ ఏరియాలోకి ఎలా వచ్చి ఎలా అడుక్కుంటారని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో వివాదం మొదలైంది.. బిక్షాటన చేసేందుకు మా ఊరికి మీరు రావద్దు.. మీ ఊరికి మేం రామని కొద్ది రోజుల క్రితం ఒప్పందం చేసుకున్నారు గంగిరెద్దు కుటుంబాలు.. కానీ, చేసుకున్న ఆ తీర్మానాన్ని మీరు పాటించడం లేదంటే మీరే పాటించటం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్న క్రమంలో రెండు వర్గాల మధ్య మాట మాట పెరిగి పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గంగిరెద్దుల వారు ఊరు ఊరు తిరుగుతూ భిక్షటన చేసుకుంటారు. తాము ఏ కులాన్ని బిక్షాటన చేస్తారో ఆ కులాన్ని ఇంకో వర్గం అడుక్కోవడనికి వీలులేదు.. కానీ, మేం అడుక్కుంటున్న వారిని మీరు అడుక్కుంటున్నారని రెండు వర్గాల వారు కొట్టుకున్నారు.. పక్కనే ఉన్న పాల పెట్టెలతో.. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.. ఇంతలోనే పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!