భూవివాదం తెచ్చిన గొడవతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చాలా రోజులుగా భూవివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. ఈరోజు ఉదయం లెహదా తోలా ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్, సత్యప్రకాష్ దూబే చాలా కాలంగా భూ వివాదంలో ఉన్నారు.
Read Also:Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రేమ్ యాదవ్ సోమవారం ఉదయం సత్యప్రకాష్ దూబే ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. వారు మాట్లాడుతుండగానే.. ప్రేమ్ యాదవ్‌పై ఓ మహిళ కత్తితో దాడి చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ్ యాదవ్ మృతి గురించి తెలుసుకున్న అతనికి సంబంధించిన కొందరు వ్యక్తులు.. దూబే ఇంట్లోకి చొరబడి అతనిని, అతని కుటుంబాన్ని హత్య చేశారు. ఈ దాడిలో దూబే కుమారుడు అన్మోల్ గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: New Zealand: ఈసారి వదిలేదు.. కప్ మాదే..!
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇదిలా ఉంటే.. మృతుల్లో ప్రేమ్ యాదవ్ (50), సత్యప్రకాష్ దూబే (54), ఆయన భార్య కిరణ్ దూబే (52), కుమార్తెలు సలోని (18), నందాని (10), కుమారుడు గాంధీ (15)గా ఉన్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు.