CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతున్న CJP
- ‘‘3 నెలలు జైల్లో పెట్టినా నిరసన కొనసాగుతుంది’’ అన్న అభిజీత్ దీప్కే
- అక్టోబర్ 2న ముంబైలో ‘జైల్ భరో ఆందోళన్’కు పిలుపు
- శివాజీ పార్క్ నిరసనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబైలోని శివాజీ పార్క్లో అక్టోబర్ 02న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ నిరసనకు పిలపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ సీజేపీ అక్కడే నిరసన నిర్వహించడానికి, ‘‘జైల్ భరో ఆందోళన్’’ కార్యక్రమం నిర్వహించడానికే ముందుకు వెళ్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు అనుమతి నిరాకరించినా తాము వెనక్కి తగ్గబోమని, ముంబై పోలీసులు ఢిల్లీ పోలీసులు కాదని, ముంబై పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
నిరసనకారులకు మూడు రోజుల పాటు బెయిల్ దొరకదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తమను జైలులో ఉంచాలనుకున్నా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని , మూడు రోజులు కాదు, మూడు నెలలైనా నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు. తన పదవికి రాజీనామా చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరకుపోతే అక్టోబర్ నెలఖారు నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో పారదర్శకత, పౌర సమాజ భాగస్వామ్యం ఉండాలని, అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపేసి, 2025 ఓటర్ జాబితానే ఉంచాలని డిమాండ్ చేశారు. దానిలో ఎలాంటి మార్పులు చేయొద్దని అన్నారు.
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..