CJI Surya Kant : న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే.. ప్రజలకు సరైన న్యాయ జరుగుతుంది!

  • తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం
  • నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు
  • న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే ప్రజలకు సరైన న్యాయ జరుగుతుంది
Cji Surya Kant

Cji Surya Kant

తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు అండ్ న్యాయవాదులు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. తిరుపతిలో కోర్టు భవనాల సముదాయ నిర్మాణం శుభసూచికమని తెలిపారు. కొత్త కోర్టులు నిర్మించబడటం ద్వారా న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ప్రజలకు వేగంగా న్యాయం అందించే అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: Munna Re-Release: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘మున్నా’ ఈజ్ బ్యాక్!

‘తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం. న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయ జరుగుతుంది. అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతో ఆసుపత్రికి వెళుతారు.‌ వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు బాగా అవుతుందని నమ్ముతారు. అలానే కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకంతో రావాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.