Site icon NTV Telugu

CJI: చాలా దేశాల్లో సమస్యలు ఆయుధాలతో పరిష్కారమవుతాయి.. భారత సంస్కృతిపై సీజేఐ ఏమన్నారంటే?

Cji Dy Chandrachud

Cji Dy Chandrachud

CJI Justice DY Chandrachud: సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ కోర్టు ద్వారా సమాజానికి అందించే ముఖ్యమైన సందేశమేమిటంటే తాము చట్టం ద్వారా వివాదాలను శాంతియుత పరిష్కారం కోసం నిలబడతామన్నారు.

గౌహతి హైకోర్టులోని ఐజ్వాల్ బెంచ్ కొత్త భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు దేశానికి అండగా నిలుస్తూ చట్టబద్ధమైన పాలన అందిస్తున్నారని సీజేఐ అన్నారు. భారతీయ సంస్థలు చర్చలు, సహనం, భాగస్వామ్య విలువలతో సమస్యలను పరిష్కరించే సంస్కృతిని అభివృద్ధి చేశాయని, అయితే చాలా దేశాలు ఆయుధాలపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. కమ్యూనిటీల మధ్య సంభాషణ దేశవ్యాప్తంగా అవగాహన భావాన్ని పెంపొందించిందని అన్నారు. అంతే కాకుండా దేశంలోని మహిళలు న్యాయవ్యవస్థలో చేరాలని విజ్ఞప్తి చేశారు. పని ప్రదేశాన్ని వారికి మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని అన్నారు.

Also Read: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ చార్జిషీటు..

గౌహతి హైకోర్టులోని ఐజ్వాల్ బెంచ్ ఒక ముఖ్యమైన దశగా సీజేఐ అభివర్ణించారు. గౌహతి హైకోర్టు ఐజ్వాల్ బెంచ్ జూలై 5, 1990న స్థాపించబడింది. తదనంతరం, కొత్త భవనానికి 2017 మార్చి 4న మిజోరం ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా, అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ సింగ్ శంకుస్థాపన చేశారు.

Exit mobile version