Site icon NTV Telugu

CJI DY Chandrachud: రెండు రోజుల ఏపీ పర్యటనకు సీజేఐ డీవై చంద్రచూడ్..

Cji

Cji

CJI DY Chandrachud: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ డీవై చంద్రచూడ్‌ ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఈ రోజు ఉదయం తిరుపతికి చేరుకోనున్న సీజేఐ డీవై చంద్రయూడ్.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు 10వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం చేయస్తారు.. సీజేఐ పర్యటన ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, యూనివర్సిటీ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు..

Read Also: Bicycles on ORR: ఓఆర్‌ఆర్‌ ట్రాక్‌పై కిరాయి సైకిళ్లు.. గంటకు రూ.50 మాత్రమే..!

ఇక, ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుపతి నుంచి తిరుమల చేరుకోనున్నారు సీజేఐ చంద్రచూడ్ దంపతులు.. రాత్రికి తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహంలో బస చేస్తారు.. రేపు ఉదయం అనగా బుధవారం రోజు తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు సీజేఐ.. ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.. రేపు ఉదయం 11 గంటలకు తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకోని హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు సీజేఐ డీవై చంద్రచూడ్‌. కాగా, గతంలోనూ తిరుమలలో పర్యటించిన సీజేఐ చంద్రచూడ్‌.. శ్రీవారిని దర్శించుకున్న విషయం విదితమే.

Exit mobile version