మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే “మీసేవ”ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు. మార్పులు, చేర్పులకు ఇప్పటికే మీసేవ ద్వారా దరఖాస్తులు అందుతున్నాయని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
Read Also: PM Modi: చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు.. మోడీ ప్రశంసలు..
కాగా.. ఈరోజు ఉదయం నుంచి జనాలు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఎగబడ్డారు. అక్కడ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం తలెత్తింది. మరోవైపు.. ఎమ్మె్ల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ దరఖాస్తులు స్వీకరించందని ప్రచారం జరిగింది. ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని, పౌరసరఫరాల శాఖ కానీ.. మీ సేవ కాని తమను సంప్రదించ లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది.
Read Also: Tamilnadu : తమిళనాడులో వీధి కుక్కల బారిన పడిన 14వేల మంది