NTV Telugu Site icon

Devara: ‘దేవర’ నుంచి కొత్త అప్‌డేట్‌.. మిడ్‌ సీలో నైట్‌ యాక్షన్!

Devara

Devara

Devara: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రేజ్‌ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ చిత్రం వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్‌ తర్వాత తారక్‌తో కొరటాల శివకు ఇది రెండో సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనట్టు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన స్పెషల్ నైట్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ గురించి మూవీ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు సోషల్‌ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: Bhagavanth Kesari: భగవంత్ కేసరి ట్రైలర్‌ విడుదల అప్పుడే..

సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ చిత్రం గురించి పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేశారు. అతను ఇలా వ్రాశాడు “మముత్ మిడ్-సీ నైట్ యాక్షన్‌ను పూర్తి చేసాను. తారక్ సోదరుడితో నీటి అడుగున, నీటిపై చిత్రీకరణ జరిగింది.” అని సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. ఎన్టీఆర్‌తో నైట్ ఎఫెక్ట్‌ లో, తక్కువ లైట్‌లో, నీళ్లల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఇప్పుడే షూటింగ్ పూర్తయింది అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు దానికి షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోను కూడా జతచేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

దేవర భారతదేశం మరచిపోయిన తీర ప్రాంతాలను హైలైట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో విలన్‌ పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్‌పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 

Show comments