Site icon NTV Telugu

CI Nageshwar Rao : మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్

Ci Nageshwara Rao

Ci Nageshwara Rao

సర్వీసు నుండి డిస్మిస్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు.వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో నాగేశ్వరరావును రెండు రోజుల క్రితమే సర్వీస్ నుండి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. రెండు రోజల క్రితమే పోలీస్ శాఖ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. రేప్ అండ్ కిడ్నాప్ కేసు లో నాగేశ్వర్ రావు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు జైల్లో ఉన్న నాగేశ్వర్ రావు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు.

 

నాగేశ్వర్ రావును సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమీషనర్.. రెండు రోజుల క్రితం సర్వీస్ నుండి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేసులో పోలీసులు అన్ని సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలు పోలీసులు పొందపరిచారు. సీసీ ఫుటేజ్ వివరాలు, డిఎన్ ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయ్యిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్‌లో పోలీసులు వివరించారు. నాగేశ్వర్ రావుకు తగిన శిక్ష పడేలా కోర్ట్ లో అన్ని ఆధారాలు పోలీసులు సమర్పించారు.

Exit mobile version