NTV Telugu Site icon

POCSO : రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తున్నారా.. సీఐపై పోక్సోతో కేసు నమోదు

Gang Rape

Gang Rape

వరంగల్‌లో సీఐపై పొక్సో కేసు నమోదు చేశారు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి బండారి సంపత్ పైనా కేయూసీ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం భూపాలపల్లి లో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 సంవత్సరంలో కాకతీయ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి..

NTR: ఎన్టీఆర్ మీద ఏం ప్రయోగం చేస్తున్నావ్ కొరటాల మావా..?
ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేశారు. అయితే.. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సంపత్ సదరు మహిళాతో ఇంకా సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో సదరు మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు మహిళ కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. . విచారణ చేసిన కేయు పోలీసులు.. గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

AICC Secretary Sampath : జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్