NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్నారు.. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇక రిలీజ్ డేట్ వెనక్కి పోవడంతో కొరటాల ఈ సినిమాను నిదానంగా పూర్తిచేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం దేవర.. గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొదట ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే అన్నారు.. ఆ తరువాత తండ్రీకొడుకులు అన్నారు. ఏది చేసినా ఎన్టీఆర్ ను బాగా చూపిస్తే చాలు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా దేవర సెట్స్ నుంచి ఒక ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్.. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇక ఈ లుక్ కొంతమందికి నచ్చింది.. ఇంకొంతమందికి ఎన్నో అనుమానాలకు తావు ఇచ్చింది. మొదటి పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ మొత్తం వేరేలా కనిపించింది. సన్నగా, ముఖం మొత్తం ఒకేలా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ బొద్దుగా కనిపించాడు. ఇది తండ్రి లుక్ నా.. ? కొడుకు లుక్ నా.. ? అనే విషయం క్లారిటీ లేదు. ఇంకోపక్క.. కొరటాల, ఎన్టీఆర్ తో ప్రయోగం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు బాడీలో ఒక లోపం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే అతడి బాడీ ఛేంజ్ అవుతుంది అని అంటున్నారు. పుష్ప లో బన్నీకి ఎలా అయితే గూని ఉంటుందో.. అలానే దేవర లో కూడా ఎన్టీఆర్ ఒక బాడీ డిసీజ్ తో బాధపడతాడంట. కానీ, ఈ లుక్ చూసాక ఏదో తేడా కొడుతోంది శీనా అని అంటున్నారు. మరి చూడాలి దేవర ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో..