Chuttamalle : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.470కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి చూపుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ‘దేవర’ నుంచి సెకండ్ సింగిల్ గా ఈ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కి ఆరంభంలో కాపీ ట్యూన్ అంటూ విమర్శలు వచ్చాయి. అయిన కూడా ఈ సాంగ్ కి జనాలు బ్రహ్మరథం పట్టారు. అతి తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో షార్ట్స్ ద్వారా ఈ సాంగ్ విపరీతంగా వైరల్ అయింది. ఈ పాటలో జాన్వీ కపూర్ అందాలు జనాలకు కట్టిపడేశాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఈ చుట్టమల్లే సాంగ్ విపరీతంగా నచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొంతమంది ఔత్సాహికులు దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ వీడియోని రూపొందించారు. దీనిలో ఇద్దరు ఫారినర్స్ ని లీడ్ పెయిర్ గా తీసుకుని వీడియో షూట్ చేశారు. పాటలోని మొదటి పల్లవి తెలుగులోనే ఆలపించగా తరువాత చరణం అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. హాలీవుడ్ పాప్ సాంగ్స్ తరహాలో ఈ పాటని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సాంగ్ ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సాంగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫారినర్స్ ఇండియన్ సాంగ్స్ కి డాన్స్ లు చేస్తున్నారు. లేదంటే వారి భాషలో పాటని ట్రాన్స్ లేట్ చేసి యుట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. దేవర మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ ‘దేవర’ పార్ట్ 2పైన అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ డిసెంబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది సెంకడాఫ్ లో మూవీ షూటింగ్ మొదలు కావొచ్చని అనుకుంటున్నారు.
Read Also:Cyber Attack In Iran: ఇరాన్‌లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా..
Read Also:Loco Pilot Murder Case: రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే..?