Legends League Cricket 2023: బ్యాట్ విరిగిపోయేలా బ్యాటింగ్ చేసిన క్రిస్ గేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ బ్యాటింగ్ లో దుమ్ములేపుతున్నాడు. 44 సంవత్సరాల వయస్సులోను క్రిస్ గేల్ బ్యాట్‌తో రెచ్చిపోతున్నాడు. ఇటీవల, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గేల్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనివర్స్ బాస్ గా ప్రసిద్ధి చెందిన గేల్.. భిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫోర్ కొట్టాడు.. దాంతో అతని బ్యాట్ విరిగిపోతుంది. కాగా, లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 నాలుగో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్ తరఫున క్రిస్ గేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గేల్ 27 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు.
Read Also: Naga Chaitanya: ఒక్క అనౌన్స్మెంట్ తో అక్కినేని ఫ్యాన్స్ లో జోష్ తెచ్చేసాడు
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ఇక, ఇదే సమయంలో క్రిస్ గేల్ స్ట్రైక్ రేట్ 192గా ఉంది.. కేవలం 23 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేశాడు, కానీ ఆ తర్వాత అతను ఔటయ్యాడు. సిద్బోథమ్ వేసిన బంతికి షాట్ కొట్టబోయి గేల్ బ్యాట్ విరిగిపోయింది.. దీంతో అతని పవర్ ఫుల్ బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ నవ్వడం ప్రారంభించారు. గేల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే 173 పరుగుల ఛేదనలో భిల్వారా కింగ్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Bat loss to universe Boss! 🥲#BhilwaraKingsVsGujaratGiants #BKvsGG #LegendsLeagueCricket #LLCT20 #BossLogonKaGame pic.twitter.com/94VUWfymsz
— Legends League Cricket (@llct20) November 22, 2023
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!