NTV Telugu Site icon

Chodavaram Students Bheri: చోడవరంలో విద్యార్థి భేరీ.. వికేంద్రీకరణ కావాలని డిమాండ్

Chodavaram

2e6ce7be Ee74 4cc7 Ba05 C7a387c1f122

ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా ఉద్యమాలు సాగుతున్నాయి. తాజాగా చోడవరంలో విద్యార్ధి భేరీ నిర్వహిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా , విశాఖ రాజధానిగా కావాలని చోడవరంలో విద్యార్థులు కదం తొక్కారు. భారీగా హాజరయిన విద్యార్థులు నినాదాలు చేశారు. చోడవరం శివాలయం నుంచి ప్రభుత్వ కాలేజ్ వరకూ సాగనుంది ఈర్యాలీ. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసులు కూలీలుగా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.

Read Also: Konda Surekha Live: పూనమ్ చేతిని రాహుల్ కావాలని పట్టుకోలేదు

వికేంద్రీకరణ లో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. మూడు రాజధానులు వలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మన అభివృద్ధి కోసం సీఎం విశాఖను పరిపాలన రాజధానిగా చేశారు..టీడీపీ, టీడీపీ తోక పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారు..ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాలు బానిసలు గా బతకాలి..విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి..విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థులు భవిష్యత్ బాగుంటుందన్నారు కరణం ధర్మశ్రీ.

Read Also: Swamy Goud: ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదు.. బండి సంజయ్ మాటలు వెనక్కు తీసుకోవాలి\