NTV Telugu Site icon

Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు

Gachibowli Firing Incident

Gachibowli Firing Incident

Prism Pub Firing Case : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు ప్రభాకర్.. ప్రభాకర్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్, బాన్సర్లు గాయపడ్డ. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకన్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకి స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో ప్రభాకర్ బస చేసినట్లు గుర్తించారు. వైజాగ్ జైల్లో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్‌ తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. జైల్లో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్‌ క్రిమినల్‌ రికార్డున్న పాత నేరస్థుడు. అతనిపై పలు చోరీల కేసులు నమోదయ్యాయి. 2022 మార్చిలో ఏపీలోని అనకాపల్లి కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకెళ్లిన సమయంలో అతను పోలీసులు గమనించని వేళ తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

పోలీసుల దృష్టికి దొరకకుండా పరారీలో ఉన్న ప్రభాకర్‌ ఇటీవల సైబరాబాద్‌ పరిధిలోని మొయినాబాద్, నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు చోరీల కేసుల్లో సంబంధం ఉన్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. అతను ఎక్కువగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చోరీలకు పాల్పడుతుంటాడు. కళాశాలల్లో ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్‌ ఫీజు లాంటి డబ్బులు నిల్వ ఉంటాయని ముందుగా అంచనా వేసి, ఖచ్చితమైన ప్రణాళికతో చోరీలకు పాల్పడతాడు.

U-19 World Cup 2025: అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత భారత్..

ఇటీవల నార్సింగి, మొయినాబాద్‌ పరిధిలో చోటుచేసుకున్న చోరీల కేసులను పరిశీలించిన పోలీసులు, అక్కడ లభించిన వేలిముద్రలను విశ్లేషించారు. వాటిని క్రిమినల్‌ రికార్డుతో పోల్చినప్పుడు బత్తుల ప్రభాకర్‌ వేలిముద్రలతో తేలియాడినట్లు గుర్తించారు. దీంతో అతని కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

పోలీసుల అనుమానం మరింత పెంచేలా, అతను దోచుకున్న డబ్బును వినోదానికి ఉపయోగిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో వెల్లడైంది. ముఖ్యంగా అతను వారాంతాల్లో ఐటీ కారిడార్‌లోని పబ్‌లకు వెళ్లి మద్యం సేవిస్తూ గడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలోని ప్రముఖ పబ్‌ల సిబ్బందికి, అక్కడి బౌన్సర్లకు నిందితుడి ఫొటోలు అందజేశారు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఆదేశాలు ఇచ్చారు.

శనివారం సాయంత్రం 7.10 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌ వద్ద ప్రభాకర్‌ ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే పోలీసుల సమాచారం అందుకున్న పబ్‌ బౌన్సర్లు అతనిని ఓ చోట నిలిపి, పబ్‌ 7.30 గంటలకు తెరుస్తారని చెప్పి వేచివుండాలని సూచించారు. ఆ సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడు. ఇంతలో అతను ఫోన్‌ ఛార్జర్‌ అడగడంతో బౌన్సర్లు అందించారు. ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు పక్కకు వెళ్లిన ప్రభాకర్‌పై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సరిగ్గా 7.30 గంటలకు సైబరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామిరెడ్డి, కానిస్టేబుళ్లు ప్రదీప్‌రెడ్డి, వీరస్వామి మఫ్టీలో అక్కడికి చేరుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగా, పోలీసులపై ప్రభాకర్‌ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్క తూటా హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామిరెడ్డి పాదం ద్వారా దూసుకుపోయి గాయపడేలా చేసింది.

ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ కానిస్టేబుళ్లు, అక్కడి బౌన్సర్ల సహాయంతో ప్రభాకర్‌ను సమర్థంగా ఎదుర్కొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..