NTV Telugu Site icon

Chit Fund Fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.50 లక్షలతో పరారీ

Fraud

Fraud

Chit Fund Fraud: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో చిట్టీల వ్యాపారంతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగిత శివకుమార్ అనే వ్యక్తి గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పెనుమల్లి, చుట్టుపక్కల ఉన్న ప్రజలతో చిట్టిల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అమాయకులైన గ్రామ ప్రజల నమ్మకాన్ని సొమ్ముచేసుకుని.. సుమారు 18 మందిని నట్టేటా ముంచి 50 లక్షల రూపాయలతో కాగిత శివకుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు అదేవిధంగా.. పెడన పట్టణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు కూడా స్వీకరించకుండా…ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు జిల్లా అధికారులు, కలెక్టర్ ఈ విషయంపై స్పందించ మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Read Also: Minister Nara Lokesh: కిడ్నీ బాధితులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి నారా లోకేష్

Show comments