Site icon NTV Telugu

MSVG : విజయవాడ, గుంటూరులో మన శంకర వరప్రసాద్ గారు.. హంగామా

Manashankar Varaprasad Garu 3rd Song

Manashankar Varaprasad Garu 3rd Song

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVG). సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ఒక భారీ ‘ప్రమోషనల్ టూర్’ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, అనంతరం 9:30 గంటలకు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

Also Read : Jai Hanuman:‘జై హనుమాన్’ నుంచి తేజ సజ్జ ఔట్? రూమర్ వెనుక అసలు నిజం ఇదే

ఆ తర్వాత ఉదయం 11 గంటలకు గుంటూరులో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో టీమ్ పాల్గొంటుంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సాంగ్ సాయంత్రం 3 గంటలకు విడుదల కానుంది. చిరంజీవి, వెంకటేష్ (వెంకీ మామ) కాంబినేషన్ కోసం మెగా మరియు నందమూరి అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది.

 

Exit mobile version