Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiru158: ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథలో సెకండ్ హాఫ్ అత్యంత కీలకంగా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో ఒక భారీ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌ను బాబీ డిజైన్ చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో సాగుతుందని, వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా అత్యంత శక్తివంతంగా ఉంటుందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ పాత్ర చుట్టూ ఒక బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా బాబీ ప్లాన్ చేసినట్లు టాక్.
READ ALSO: Telangana : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
Also Read
మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో, సరికొత్త మాస్ అవతార్‌లో చూపించాలనే పట్టుదలతో బాబీ ఈ కథను సిద్ధం చేశారట. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా, అభిమానులు కోరుకునే అన్ని అంశాలను జోడిస్తూనే ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రాబోతోందని చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె.నారాయణ – లోహిత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో చిరు – బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ను మించి ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది.
READ ALSO: IPL 2026: సన్‌రైజర్స్ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!